తెలంగాణ సీఎం సహయనిధికి ప్రభాస్ భారీ విరాళం..

343
prabhas
- Advertisement -

తెలంగాణ లో భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం ఏర్పడింది. హైదరాబాద్ నగరంలో ఎన్నో ప్రాంతాలు పూర్తిగా నీట మునిగి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి సహాయార్ధం రెబల్ స్టార్ ప్రభాస్ తెలంగాణ సీఎం సహయనిధి కి తన వంతు సాయంగా కోటి రూపాయల విరాళం ప్రకటించారు.

సీఎం సహాయనిధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులు, సినీప్రముఖులు సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలు అందజేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రూ.15 కోట్లు, తమిళనాడు సీఎం రూ.10 కోట్లు, మమతాబెనర్జీ రూ. 2 కోట్ల, మైహోమ్‌ గ్రూప్‌ రూ.5 కోట్లు ప్రకటించగా.. సినీహీరోలు మహేశ్‌బాబు, చిరంజీవి రూ. కోటి చొప్పున జూనియర్‌ ఎన్టీఆర్‌ రూ. 50లక్షలు విరాళం అందజేసిన విషయం తెలిసిందే.

- Advertisement -