“వకీల్ సాబ్” ఫస్ట్ సాంగ్ ప్రోమో

479
maguvasong
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోణి కపూర్ , దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈచిత్రంలో నివేధా ధామస్, అంజలిలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

ఈనెల 8న మహిలా దినోత్సవం సందర్భంగా అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వనున్నారు వకీల్ సాబ్ టీం. ఈ మూవీ నుంచి తొలి పాట ప్రోమోను మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. మగువా మగువా ఈ లోకానికి తెలుసా నీ తెగువ అంటూ షురూ అయ్యే పాట మహిళల గొప్పతనాన్ని చాటేలా సాగుతుంది. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ఉదయం 10 గంటలకు పాటను విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేశాడు థమన్.

- Advertisement -