యూ ట్యూబ్‌ ట్రెండింగ్‌లో ‘వకీల్ సాబ్’

224
pawan
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వకీల్ సాబ్. సంక్రాంతి కానుకగా విడుదల చేసిన వకీల్ సాబ్ టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. యూ ట్యూబ్‌ ట్రెండింగ్‌లో నెంబర్ 1 స్ధానంలో దూసుకుపోతోంది. కోర్టులో వాదించడమూ తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు అంటూ పవన్ చెప్పిన డైలాగ్ అభిమానులకు విపరీతంగా ఆకట్టుకున్నాయి

అతి తక్కువ సమయంలోనే వకీల్ సాబ్ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నంబర్‌ వన్ లో నిలిచింది. ట్విట్టర్ లోను పవన్ కళ్యాణ్ హంగామా ఏమాత్రం తగ్గలేదు. వకీల్ సాబ్ హ్యాష్ టాగ్స్ లతో ఫ్యాన్స్ ట్విట్టర్ ను షేక్ చేశారు. టీజర్ లో పవన్ చెప్పిన డైలాగులు, పవన్ లుక్ ఆకట్టుకుంటున్నాయి. పవన్‌కు జోడిగా శృతిహాసన్ నటించగా అంజలి, నివేదా, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు.

- Advertisement -