పవన్ ‘వకీల్ సాబ్’ షూటింగ్ షురూ..

136
pawan

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. పవన్ ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. కొన్ని నెలలుగా ఖాళీగానే ఉన్న చిత్ర యూనిట్ ఇప్పుడు ఈ మూవీని పట్టాలెక్కించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న వకీల్ సాబ్ షూటింగ్ చాలా రోజుల తర్వాత మళ్లీ మొదలు కావడంతో అభిమానులు కూడా సంతోష పడుతున్నారు. హీరోయిన్లు శృతి హాసన్, అంజలి, నివేద థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హిందీ సినిమా ‘పింక్’ రీమేక్‌గా వకీల్ సాబ్ వస్తుంది. తెలుగులో దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతికి దీనిని విడుదల కానుంది.

ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్‌కి ముందే దాదాపు 80 శాతం పూర్తయింది. కేవలం కొన్ని రోజుల పార్ట్ మాత్రమే మిగిలిపోయింది. 15 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉండటంతో త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే హైదరాబాద్ పరిసరాల్లో వకీల్ సాబ్ సినిమా షూటింగ్ చేస్తున్నారు యూనిట్. ఈ చిత్రీకరణలో కథానాయిక అంజలితో పాటు మరికొందరు ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. కానీ హీరో పవన్ కళ్యాణ్ మాత్రం అక్టోబర్‌లో జాయిన్ కానున్నాడని తెలుస్తుంది.