కరోనా వైరస్ పై ఎలాంటి అపోహలు వద్దుః మంత్రి ఈటెల

431
Minister Etela
- Advertisement -

కరోనా వైరస్ పై ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజెందర్. కరోనా వైరస్ పై కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. 5 కమిటీ లకు సంబంధించి విధివిధానాలు పైన చర్చించడం జరిగింది. యోగీత్ రానా ,ప్రీతి మీనా,మానిక్ రాజ్,శ్రీదేవి,శాంత్ కుమారి ఐ ఏ ఎస్ ల కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇంటర్నేషనల్ ప్యాసింజర్ లనే కాకుండా డొమెస్టిక్ ప్యాసింజర్ లను కూడా తనిఖీ చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు పైన కేంద్రప్రభుత్వ అభినందించడం జరిగిందన్నారు. ఎలాంటి మాస్క్ లు వాడాల్సిన అవసరం లేదన్నారు. మాస్క్ లను అధిక రేట్ కు అమ్ముతున్న వారి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -