దుమ్ములేపుతున్న‘వకీల్ సాబ్’..

51
Vakeel Saab

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వకీల్ సాబ్’. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను జనవరి 14న విడుదల చేశారు. ఈ టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం టీజర్‌ ట్రెండింగ్‌ అవుతోంది. ‘కోర్టులో వాదించడమూ తెలుసు..కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అంటూ పవన్‌ చెప్పిన డైలాగ్‌ అలరిస్తోంది.

బాలీవుడ్​ హిట్ సినిమా ‘పింక్’​ రీమేక్​గా ‘వకీల్‌ సాబ్’‌ తెరకెక్కించారు. ఇందులో పవన్​ న్యాయవాదిగా కనిపిస్తారు. శ్రుతిహాసన్ కథానాయిక. అంజలి, నివేదా, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు.చిత్రానికి తమన్ సంగీతం అందించారు. దిల్​ రాజు సినిమాను నిర్మించారు. ఈ టీజర్‌తో పవన్‌ ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు.

Vakeel Saab Teaser - Pawan Kalyan | Sriram Venu | Thaman S