మా…చిరు వర్సెస్ మోహన్ బాబు..!

19
chiru vs mohan babu

మా ఎన్నికలు ముగిసిన ఆర్టిస్ట్‌లు మధ్య మాత్రం మాటల యుద్దం ఆగడం లేదు. ఓ సినిమా ప్రీ రిలీజ ఫంక్షన్‌లో మాట్లాడిన చిరు…హీరోలందరూ కలిసి ఉంటే గొడవలు అవ్వవు. ‘మా’ పదవుల కోసం కొట్టుకోవడం అవసరమా ? ఒక పదవి కోసం అంత లోకువ కావాలా ? అంటూ వ్యాఖ్యానించారు. అసలు మాలో గొడవలకు కారణమెవరో తెలుసుకుని వారిని దూరంగా పెట్టాలని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యాలకు ఘాటుగా స్పందించారు మోహన్ బాబు.సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే భయపడికాదు పంజా విసరడానికి..తాను అసమర్థుడిని కాదు..ఎప్పుడు స్పందించాలో అప్పుడు స్పందించాలని ఆగానని తెలిపారు. ఎక్కడా మాట్లాడడానికి అవకాశం లేక, ఎక్కడో ఒక వేదిక దొరికితే ఆ వేదికలో ఇష్టం వచ్చినట్టు నోరు జారడం మనిషిని దీనస్థితికి దిగజార్చుతుందని చిరుకు కౌంటరిచ్చారు.

నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాట్లాడండి. ప్రజలు చూస్తున్నారు. అందరూ చూస్తున్నారు. మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి అంటూ సూచించారు.