మెగాస్టార్‌పై మంచు విష్ణు షాకింగ్‌ కామెంట్స్‌..

56

మా ఎలక్షన్ నుంచి చిరంజీవి నన్ను విత్ డ్రా చేసుకోమన్నారు.. ఏకగ్రీవం చేసేందుకు ఆయన నన్ను పోటీ నుండి తప్పుకోమన్నారు.. ఈ విషయం చెప్పకూడదనుకున్నా.. కానీ ఎన్నికలు అయిపోయాయి గనుక చెబుతున్నా అంటూ మంచు విష్ణు సంచలన వ్యాఖ్యానించారు. మా అధ్యక్ష పదవి పోటీలో ప్రత్యర్థి ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈరోజు తుది ఫలితాల అనంతరం జూబ్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

మంచు విష్ణు మాట్లాడుతూ.. రామ్ చరణ్ నాకు మంచి మిత్రుడు. కానీ రామ్ చరణ్ ఓటు ప్రకాశ్ రాజ్ కే వేశాడు. నేను నాన్ తెలుగు ఫ్యాక్టర్‌ను నమ్మను. నాగబాబు తన రాజీనామాను ఉపసంహరించుకోవాలి. ఆయన రాజీనామాను ఆమోదించను. గెలుపోటములు సహజం. మా నాన్న వల్లే నేను అధ్యక్షుడిగా గెలిచా. నాన్న మీద నమ్మకంతోనే నాకు ఓటేశారు. ఓటు వేసినవారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తా. మా సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా కృషి చేస్తాం.. అని మంచు విష్ణు అన్నారు.