బిగ్ బాస్ 5…ఆరోవారం నామినేషన్‌లో ఉంది వీరే!

24
bb5

బిగ్ బాస్ 5 తెలుగు విజయవంతంగా ఆరోవారంలోకి ఎంట్రీ కాగా కీలకమైన సోమవారం ఎలిమినేషన్ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగింది. ఎవరిని ఎలిమినేట్ చేస్తున్నారు..అందుకుగల కారణాలను చెప్పాలని కోరగా మొదటగా సన్నీ వచ్చి.. యాంకర్ రవి, జెస్సీలను నామినేట్ చేశాడు. కొన్ని టాస్కుల్లో వెన్నునొప్పి అని తప్పించుకోవడం తనకు నచ్చలేదని రవిని సన్నీ నామినేట్ చేశాడు. టాస్కు విషయంలో జెస్సీ ప్రవర్తన నచ్చలేదని తెలిపారు.

విశ్వ.. ఆనీ మాస్టర్, ప్రియాంకలను,శ్వేత.. సిరి, కాజల్‌ను నామినేట్ చేసింది. టాస్క్‌లో అగ్రెసివ్ అవ్వకు అని స్టేట్మెంట్ చెప్పిందని, అది తనకు నచ్చలేదు అని సిరిని శ్వేత నామినేట్ చేసింది. లోబో.. ప్రియాంక, జెస్సీలను నామినేట్ చేశాడు.టాస్కులో నమ్మకం కోల్పోయారు.. నాణెంలను దొంగిలించి కూడా దొంగలించలేదంటూ అబద్దం చెప్పారంటూ నామినేట్ చేశాడు.

తర్వాత సిరి.. శ్రీరామచంద్ర, శ్వేతలను , రవి.. మానస్, సిరిలను ,జెస్సీ.. శ్రీరామచంద్ర, సన్నీలను నామినేట్ చేశాడు. కిచెన్ గొడవలను మళ్లీ జెస్సీ వేలెత్తిచూపించాడు. అందుకే శ్రీరామచంద్రను నామినేట్ చేస్తున్నానని జెస్సీ అన్నాడు. ప్రియాంక.. లోబో, విశ్వలను నామినేట్ చేసింది. నమ్మకం బ్రేక్ చేశావని నన్ను నామినేట్ చేశావ్.. టాస్క్ చివర్లో నువ్ చేసింది ఏంటి? అని లోబోను నామినేట్ చేసింది.

మానస్.. రవి, లోబోలను, ఆనీ మాస్టర్.. విశ్వ, షన్నులను,శ్రీరామచంద్ర.. సిరి, షన్నులను నామినేట్ చేశాడు. కాజల్‌.. శ్రీరామచంద్ర, శ్వేతలను నామినేట్ చేసింది. శ్రీరామ్ నుంచి కనెక్షన్ రావడం లేదని నామినేట్ చేసింది. షన్ను.. శ్రీరామచంద్ర, లోబోలను నామినేట్ చేశాడు. చివరగా ప్రియ.. విశ్వ, సన్నీలను నామినేట్ చేసింది. ఇలా మొత్తానికి ఈ ఆరోవారంలో ఇంటి నుంచి వెళ్లేందుకు షన్ను, ప్రియాంక, లోబో, శ్రీరామ, రవి, సిరి, విశ్వ, శ్వేత, సన్నీ, జెస్సీ నామినేట్ అయ్యారు. మొత్తంగా నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగింది.