మా ఎన్నికలు…రంగంలోకి రెబల్ స్టార్!

40
krishnam raju

సాధారణ ఎన్నికలను తలపించేలా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్( మా) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రధానంగా ప్రకాశ్‌ రాజ్, మంచు విష్ణు ప్యానెల్‌ల మధ్య గట్టిపోటీ నెలకొనగా మంచు విష్ణు మాటల యుద్దానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఇక మా అధ్యక్షుడి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ఇప్పటికే సీనియర్ నటులు ప్రయత్నిస్తుండగా తాజాగా రెబల్ స్టార్ కృష్ణంరాజు రంగంలోకి దిగారు.

త్వరలోనే కృష్ణంరాజు ప్రస్తుత కౌన్సిల్‌తో పాటు రాబోయే ఎన్నికల విషయమై పోటీదారులతో సమావేశం కానున్నారు. ప్రస్తుత అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ సరిగ్గా లేదని, ఇటీవల వివాదాల వెనుక ఇదే కారణమని ‘మా’ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కృష్ణంరాజుకు లేఖ రాసింది. దీనిని పరిగణనలోకి తీసుకుని కృష్ణరాజు ‘మా’ సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.

ఇక షెడ్యూల్‌ ప్రకారం మా ఎన్నికలు సెప్టెంబర్ నెలలో జరుగుతాయి. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది.