కృష్ణంరాజు మృతి..షూటింగ్‌లు ఆపేద్దాం: ఆర్జీవీ

82
- Advertisement -

రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతికి సంతాపం తెలిపారు దర్శకుడు ఆర్జీవీ. అదేవిధంగా ఇండస్ట్రీకి కీలక సూచన చేశారు. కృష్ణంరాజు మరణం నేపథ్యంలో రెండు రోజుల పాటు షూటింగ్లు ఆపండి అని ట్వీట్ చేశారు. మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజు లాంటి పెద్ద మనిషికి విలువ ఇద్దాం .. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదామని తెలిపారు.

డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెల రోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనదని గుర్తు చేశారు. కృష్ణగారికి,మురళీ మోహన్ గారికి, బాలయ్యకి , ప్రభాస్ కి ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదని హెచ్చరించారు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిదని వివరించారు ఆర్జీవీ. గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమ కి నా జోహార్లు అని పేర్కొన్నారు.

- Advertisement -