4 రోజుల్లో 25 వేల కేసులు..

43
lockdown

రాష్ట్రంలో కరోనా కట్టడికి 10 రోజుల పాటు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. నేటితో లాక్ డౌన్ ఐదో రోజుకు చేరగా గత నాలుగు రోజుల్లో లాక్ డౌన్ ఉల్లంఘించిన వారిపై పెద్ద ఎత్తున కేసులు నమోదుచేశారు.

నాలుగు రోజుల్లో 25 వేల కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. అకారణంగా కొందరు..చిన్నచిన్న పనుల కోసం రోడ్లెక్కుతుండటంతో వారిపై విపత్తు నిర్వహణ చట్టంతోపాటు, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. వారి వాహనాలను సీజ్‌ చేస్తున్నారు.

వీటిలో ఎక్కువ భాగం గ్రేటర్ పరిధిలో నమోదు కాగా మాస్క్‌ ధరించకున్నా, సరిగా పెట్టుకోని వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, పాన్‌మసాలాలు నమిలేవారు, సిగరెట్‌ తాగేవారిపైనా కేసులు పెట్టాం అని వెల్లడించారు పోలీసులు.