కరోనా కట్టడి…సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ

66
stalin

తమిళనాడులో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో సీఎం స్టాలిన్ లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనాతో బాధ పడుతున్న పేదల బాధలు తీర్చేందుకు తమ వంతు సాయం చేసేందుకు సీఎం సహాయనిధికి విరాళాలు అందించేందుకు పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు.

త‌మిళ న‌టులు సూర్య‌, కార్తి ముఖ్య‌మంత్రి స్టాలిన్‌ను క‌లిసి కోటి రూపాయ‌లు విరాళంగా అందించారు. మురుగ‌దాస్ 25 ల‌క్ష‌లు, అజిత్ 25 ల‌క్ష‌లు, సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ భ‌ర్త్ విశాగ‌ణ్ కోటి రూపాయ‌లు అందించగా ద‌ర్శ‌కుడు వెట్రిమార‌న్ రూ.10 ల‌క్ష‌ల చెక్ అందించారు.త‌మిళ న‌టుడు శివ కార్తికేయ‌న్ విరాళం కింద పాతిక ల‌క్ష‌ల చెక్‌ను సీఎంకు అందించారు.

ఇక ఎడిట‌ర్ మోహ‌న్, ఆయ‌న త‌న‌యుడు మోహ‌న్ రాజా, జ‌యం ర‌వి ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి కింద రూ. 10 ల‌క్ష‌ల రూపాయ‌ల విరాళం అందించారు.