- Advertisement -
ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. ఆయన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి పార్టీలో లేదు. ఈ నియామకంతో టీఆర్‌ఎస్ పార్టీలో నూతన అధ్యాయానికి కేసీఆర్ తెరదీశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17న తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
జాతీయ రాజకీయాల్లో గుణాత్మర మార్పు తీసుకురావడానికి దేశ రాజకీయాలపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే కేటీఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన కేటీఆర్‌కు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -