ఈనెల 22, 23 తేదీల్లో సౌదీఅరేబియాలో పర్యటించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు మోదీ. 2014లో ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత మోదీ 2016 మరియు 2019లో సౌదీలో పర్యటించనున్నారు.
తాజా పర్యటనలో భాగంగా వాణిజ్యం మరియు పెట్టుబడులు, ఇంధన సహకారం, ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ కారిడార్ (IMEEC) పునరుద్ధరణ, రక్షణ భాగస్వామ్యం వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మేలో సౌదీ అరేబియాకు వెళ్లే ముందు ప్రధాని పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్‌పై చేసిన దాడుల తర్వాత గాజాలో కొనసాగుతున్న యుద్ధం వల్ల IMEEC ప్రాజెక్ట్ ముందుకు సాగడంలో అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి, ప్రాజెక్టును పునఃప్రారంభించేందుకు భారత్ సౌదీ అరేబియాతో చర్చలకు సిద్ధంగా ఉంది.
Also Read:వీడియో..మైనర్ విద్యార్థులతో టీచర్ మద్యం!

