వేసవిలో చర్మసమస్యలా.. అయితే ఇలా చేయండి!

32
- Advertisement -

వేసవికాలం వచ్చేసింది. ఈ వేసవిలో వచ్చే చర్మసమస్యలు అన్నీ ఇన్నీ కావు. సూర్యుడి నుంచి వచ్చే యువీ కిరణాల వల్ల పలు రకాల చర్మవ్యాధులు చుట్టుముడుతూ ఉంటాయి. అధిక చెమట కారణంగా చర్మంపై చెమటకాయలు రావడం, దద్దుర్లు ఏర్పడడంతో దురద, మంట వంటి సమస్యలు వేదిస్తాయి. ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు రకరకాల సన్ లోషన్స్, కూలింగ్ పౌడర్స్ వంటివి వాడుతుంటారు. అయితే వేసవిలో వచ్చే చర్మసమస్యను తగ్గించుకోవడానికి హోమ్ రేడిమిస్ కూడా చక్కగా ఉపయోగ పడతాయి. అవేంటో చూద్దాం !

ఆలోవెరా, తేనె వంటివి వేసవిలో వచ్చే చర్మ సమస్యలను తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి. ఆలోవెరా జల్ శరానికి చల్లదనాన్ని అందించడంతో పాటు చర్మంపై ఏర్పడే దద్దుర్లను కూడా నివారిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఔషధగుణాలు శరీర వేడిని తగ్గిస్తాయి. అందువల్ల మొఖంపై లేదా చర్మం పై ఆలోవెరా జల్ పూయడం వల్ల యువీ కిరణాల నుంచి కొంతైనా ఉపశమనం లభిస్తుంది. ఇక తేనెలో కూడా యాంటీ ఇన్ ఫ్లమెంటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల తేనె చర్మానికి రాయడం వల్ల సన్ బర్న్ మరియు టానింగ్ ల నుంచి ఉపశమనం లభిస్తుంది.

సన్ బర్న్ వల్ల ఏర్పడే చర్మపు చికాగు తగ్గించడంలో ఆపిల్ వెనిగర్ కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఎండ వల్ల ఏర్పడిన దద్దుర్లు లేదా చికాగు అనిపించిన ప్రాంతంలో కొద్దిగా ఆపిల్ వెనిగర్ వేసి కాస్త మసాజ్ చేస్తే. వాటినుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా వేదించే చర్మసమస్యలలో కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడడం. దీనిని తగ్గించడానికి కీరదోస ఎంతగానో ఉపయోగపడుతుంది. కీరదోసలో ఉండే విటమిన్ ఇ కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలను తగ్గించడంతో పాటు, కళ్ళకు చల్లదనాన్ని ఇస్తుంది. ఇక ఈ వేసవిలో చర్మానికి కావలసిన పోషణను అందించడానికి పెరుగు, బొప్పాయి వంటివికూడా ఎంతో మేలు చేస్తాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -