22న తెలంగాణ ఇంటర్ ఫలితాలు

15
- Advertisement -

ఈనెల 22న తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి.  నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తారు.  మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.

ఇంటర్మీడియట్ పరీక్షలను మార్చి ఐదు నుంచి 25వ తేదీ వరకు 1532 కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షలకు 9, 96,971 మంది విద్యార్థులు హాజరయ్యారు. రెండు దశల్లో పరిశీలన చేసిన తర్వాతే ఫలితాల వెల్లడికి ఇంటర్ బోర్డు సిద్ధమైంది. ఫలితాల వెల్లడి తర్వాత రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌కు సైతం అవకాశం ఇవ్వనున్నారు.

ఇంటర్ ఫలితాలు నేరుగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లో అందుబాటులో ఉంటాయి.

Also Read: తెలంగాణలో డ్రై పోర్ట్‌ ఏర్పాటు: సీఎం రేవంత్

- Advertisement -