మధ్యప్రదేశ్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కట్నీ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థులకు మద్యం ఇవ్వడం పై ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనను సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఖిరహాని గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది.
లాల్ నవీన్ ప్రతాప్ సింగ్ అనే ఉపాధ్యాయుడు చిన్నపిల్లలకు మద్యం గ్లాసుల్లో పోసి ఇస్తుండగా వీడియోలో కనిపించారు. ఒక దశలో, విద్యార్థికి నీరు కలిపి త్రాగమని సూచించే విధంగా ఆయన చెప్పడం కూడా వినిపించింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కట్నీ జిల్లా కలెక్టర్ దిలీప్ కుమార్ యాదవ్ వెంటనే స్పందించి జిల్లా విద్యా అధికారి ఓపీ సింగ్‌కు దర్యాప్తు ఆదేశించారు. సింగ్‌ను అదే రోజు ఎంపీ సివిల్ సర్వీసెస్ (కండక్ట్) రూల్స్ ప్రకారం తీవ్ర నిర్లక్ష్యం, ఆచార నియమాలకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొంటూ సస్పెండ్ చేశారు.
शिक्षा का मंदिर शर्मसार!
कटनी, मध्य प्रदेश में एक शिक्षक द्वारा मासूम बच्चों को देशी शराब पिलाने का घिनौना कृत्य सामने आया है।
यह घटना प्रदेश की शिक्षा व्यवस्था और भाजपा सरकार की लापरवाही का सीधा प्रमाण है।
भाजपा शासन में शिक्षक मर्यादा भूले बैठे हैं और सरकार आंख मूंदे बैठी है। pic.twitter.com/Zl66PF7I9x— Manjeet Ghoshi (@ghoshi_manjeet) April 18, 2025
Also Read:SSMB29:హైదరాబాద్‌కు ప్రియాంక

