ఈ ఏడాది భారత్‌కు వస్తున్నా: మస్క్

18
- Advertisement -

ప్రధాని మోదీతో మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నానని , ఈ ఏడాది చివర్లో భారత్‌కు రాబోతున్నానని తెలిపారు టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన మస్క్.. భారత ప్రధానితో సానుకూల చర్చలు జరిగాయన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. వాషింగ్టన్ డీసీలో గతంలో జరిగిన మా సమావేశంలో చర్చించిన అంశాలను మళ్లీ ఎలాన్ మస్క్‌తో మాట్లాడాను… సాంకేతికత మరియు ఆధునిక రంగాలలో భాగస్వామ్యానికి అపార అవకాశాలపై చర్చించాం అన్నారు. ఈ రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడంలో భారత్ పూర్తి నిబద్దతతో ఉందన్నారు.

స్పేస్, మొబిలిటీ, సాంకేతికత మరియు నవోన్నతి వంటి నాకు నచ్చిన అంశాల గురించి చర్చించాము అని తెలిపారు ప్రధాని మోదీ. ఎలాన్ మస్క్ పిల్లలతో గడిపిన మధుర క్షణాల ఫోటోలను పంచుకున్నారు. మిస్టర్ ఎలాన్ మస్క్ కుటుంబ సభ్యులను కలవడం ఆనందంగా ఉంది. అనేక అంశాలపై వారితో చర్చ జరిపాను అని ఎక్స్‌లో రాసుకొచ్చారు మోదీ.

ప్రస్తుతం టెస్లా భారత మార్కెట్లో ప్రవేశించబోతున్న సందర్భంలో మస్క్‌తో మోదీ చర్చ జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read:వీడియో..మైనర్ విద్యార్థులతో టీచర్ మద్యం!

- Advertisement -