రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్..

200
Ashok Gehlot

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి ఎంపికపై రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. సీనియర్‌ నేత అశోక్ గెహ్లాట్‌ను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. సీఎం పీఠం కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలట్ పోటీలో ఉన్న విషయం తెలిసిందే. రెండుసార్లు సీఎంగా పనిచేసిన గెహ్లాట్ మూడోసారి అవకాశం కోసం ఎదురు చూస్తుండగా పీసీసీ చీఫ్‌గా ఉండి పార్టీని విజయపథంలో నడిపించిన పైలట్ కూడా ఆ రేసులో ముందున్నారు.

Ashok Gehlot

సీనియర్‌ నేతలతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విస్తృత మంతనాల అనంతరం ఏఐసీసీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సీఎంగా నిర్ణయం తీరుకున్నారు. దీంతో అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ తదుపరి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు సచిన్‌ పైలట్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాజస్థాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కూడా పైలట్‌ కొనసాగనున్నారు. అయితే దీనిపై ఈరోజు సాయంత్రం ఏఐసీసీ వర్గాలు అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.