టీఆర్ఎస్‌ ఆవిర్భావం..జెండా ఆవిష్కరించనున్న కేటీఆర్

161
ktr trs bhavan

తెలంగాణ రాష్ట్ర సమితి 18వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో ఉదయం 9 గంటలకు పార్టీ జెండాను ఎగురవేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు,ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు రాష్ట్ర స్ధాయి నేతలు హాజరుకానున్నారు.

ఇక పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించుకోవాలని కేటీఆర్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.

గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరపాలన్నారు. వివిధ స్థాయిల్లో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనాలని కేటీఆర్‌ సూచించిన సంగతి తెలిసిందే.

2001 ఏప్రిల్‌ 27 టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఆవిర్భవించింది. 13 ఏళ్ల ఉద్యమ ప్రస్ధానంలో ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొని ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చింది. నాడు ఉద్యమ పార్టీగా నేడు రాజకీయ పార్టీగా బంగారు తెలంగాణ సాధనలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే నెంబర్‌ 1 రాష్ట్రంగా తెలంగాణ ముందుకుసాగుతోంది.