‘గుణ369’.. ఫస్ట్‌ లుక్‌తో ఆకట్టుకున్న ‘RX100’ హీరో

260
GUNA 369 First Look

టాలీవుడ్‌లో ‘RX100’ మూవీతో సూపర్ హిట్ సాధించి అందరి దృష్టిలో పడిన హీరో కార్తికేయ. కార్తికేయకు ప్రస్తుతం యూత్‌లో యమా క్రేజ్‌ ఉంది. మొదటి సినిమా హిట్ కావడంతో కార్తికేయకు ఆఫర్లు చాలానే వచ్చాయి. అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడు. అందులో ‘హిప్పి’ జూన్ 7న రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా.. ఈ సినిమాతో పాటు నాని హీరోగా నటిస్తున్న ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో కార్తికేయ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

ఇక కొన్ని నెలల క్రితం కొత్త దర్శకుడు అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఒక సినిమా స్టార్ట్ అయింది. ఇయన బోయపాటి శ్రీను దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. తాజాగా కార్తికేయ – అర్జున్ జంధ్యాల సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలేజ్ చేశారు. ఈ సినిమాకు ‘గుణ369’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ లాక్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో కార్తికేయ షర్ట్ లేకుండా బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అవతారంలో కనిపిస్తున్నాడు. వెనక్కు తిరిగి తల వెనక చేతులు పెట్టుకోవడంతో మొహం కనపడడం లేదు. కానీ ఫస్ట్ లుక్ మాత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ చిత్రాన్ని స్పిన్ట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చింతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్ర కథానాయిక, షూటింగ్ తదితర విషయాలు తెలియాల్సి ఉంది.

GUNA 369 First Look