కేంద్ర ప్రభుత్వానివి అన్నీ ఉత్తమాటలే- కేటీఆర్‌

58
ktr road show

గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీ కేటీఆర్‌ నేడు మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో అల్వాల్‌, యాప్రాల్, ఆనంద్ బాగ్ లలో రోడ్‌షో నిర్వహించారు.అల్వాల్‌ నుంచి టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్న విజయశాంతి, మచ్చబొల్లారం నుంచి జితేంద్రనాథ్‌, వెంకటాపురం నుంచి సబితా అనిల్‌ కిశోర్, నెరేడ్ మెట్ నుంచి మీనా ఉపేందర్ రెడ్డ్, ఈస్ట్ ఆనందబాగ్ నుంచి వై. ప్రేమ్ కుమార్, వినాయక్ నగర్ నుంచి బద్ధం పుష్పలతరెడ్డి, మౌలాలి నుంచి ముంతాజ్ ఫాతిమా, మల్కాజ్ గిరి నుంచి జగదీశ్ గౌడ్, గౌతమ్ నగర్ నుంచి మేకల సునీత రాము యాదవ్ భారీ మెజార్టీతో గెలిపించాల్సింది కోరారు.

ఈ సందర్భంగా యాప్రాల్‌ అంబేద్కర్‌ చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్‌ మాట్లాడుతూ..వరదలు వచ్చినా..కరోనా వచ్చినా ప్రజలను ఆదుకున్నది రాష్ట్ర ప్రభుత్వమేనని.. ప్రజల కన్నీళ్లు తుడిచేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని కేటీఆర్‌ చెప్పారు. ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర మంత్రులు గుంపులుగా వస్తున్నారని ఆయన విమర్శించారు. కేంద్ర మంత్రులు ఉత్త చేతులతో మాత్రం రావొద్దు. సీఎం కేసీఆర్‌ చెప్పినట్లుగా రూ.1350కోట్ల వరద సాయం తీసుకొని రావాలన్నారు కేటీర్‌.

సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలను ఆదుకుంటున్నది కేసీఆర్‌ మాత్రమే. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌, వరదసాయం రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వానివి అన్నీ ఉత్తమాటలే..చేసిందేమీ లేదు. బీజేపీ నాయకులు నోటికెంతొస్తే అంత మాట్లాడుతున్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని మోదీ మాట తప్పారు. హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉంటేనే సంక్షేమం కొనసాగుతుంది. పేదలకు ఇళ్లు కట్టిస్తామన్న హామీని తప్పనిసరిగా నెరవేరుస్తామని’ కేటీఆర్‌ పేర్కొన్నారు. రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ ఇస్తున్నామంటూ కేంద్రం అవాస్తవాలు చెబుతోంది. బీజేపీ మాటలకు ప్రజలు మోసపోవద్ద అన్నారు మంత్రి కేటీర్‌