తెలంగాణ గడ్డ మీద పుట్టి తెలంగాణకు ఓటు వేయకపోతే ఎందుకు..

68
Old Lady

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంకటేశ్వర్ నగర్ కాలనీ ప్రచారం చేస్తు ప్రజలను ఓట్లు అడుగుతున్నారు.. అయితే ఈసందర్భంగా మంత్రి అక్కడే వున్న లక్ష్మీ అనే వృద్ధురాలిని ఓటు అడుగుతుండగా ఆవిడే కల్పించుకొని తెలంగాణ గడ్డ మీద పుట్టినప్పుడు తెలంగాణ కు వేయకపోతే ఎందుకు… జై తెలంగాణ జై జై తెలంగాణ అంటూ మాట్లాడారు. ఇది విన్న రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి లక్ష్మీని అభినందించి ఈ స్ఫూర్తి లక్ష్మీ లోనే కాదు అందరిలోనూ వుందని ఇదే స్ఫూర్తితో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని అన్నారు.