తెలంగాణ ఆహారశుద్ది పాలసీపై మంత్రులతో కేటీఆర్ సమావేశం..

348
ktr
- Advertisement -

ముఖ్యమంత్రి కృషి వల్ల తెలంగాణలో జల విప్లవం వస్తున్నది, లక్షలాది ఎకరాల బీడు భూములు కృష్ణా, గోదావరి నదుల నీటితో సస్యశ్యామలం అవుతున్నాయని తెలిపారు మంత్రి కేటిఆర్. తెలంగాణ ఆహార శుద్ధి పాలసీ, లాజిస్టిక్స్ పాలసిలపై చర్చించడానికి, గైడ్ లైన్స్ రూపకల్పనకు ప్రగతి భవన్ లో అందరూ మంత్రులతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో తెలంగాణలో పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తుల గురించి, దానివల్ల మనకు ఆహార శుద్ధి రంగంలో వస్తున్న నూతన అవకాశాల గురించి వివరించారు.

ఈ జల విప్లవం తోడ్పాటుతో నీలి విప్లవం (మత్స్య పరిశ్రమ), గులాబీ విప్లవం (మాంస ఉత్పత్తి పరిశ్రమ) శ్వేతా విప్లవం (పాడి పరిశ్రమ) కూడా తెలంగాణలో రానున్నాయని చెప్పారు.ముఖ్యమంత్రి సూచన మేరకు తెలంగాణలో ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ జిల్లాలో ఏం పంటలు పండుతున్నాయి అనేది పూర్తిగా మ్యాపింగ్ చేశాం అని తెలిపిన కేటీఆర్…..రాష్ట్రం ఏర్పడ్డాక వరి, పత్తి, మొక్క జొన్న, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి బాగా పెరిగింది…ముఖ్యమంత్రి గారి చొరవతో గొర్రెల పంపకం, చేప పిల్లల పెంపకం వల్ల రాష్ట్రంలో గొర్రెల సంఖ్య, చేపల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగిందన్నారు.

రాష్ట్రంలో ఇప్పుడు ఉత్పత్తి అవుతున్న పంటలను పూర్తిగా ప్రాసెసింగ్ చేసే సామర్ధ్యం మనకు లేదు. దీనితో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి అయితే వ్యవసాయ ఉత్పత్తులు ఇంకా పెరుగుతాయి.అందువల్ల వెంటనే మనం ఈ ఆహార శుద్ధి రంగ పరిశ్రమలను ప్రోత్సహించాలి. తద్వారా మన తెలంగాణ రైతుకు ఆర్థిక స్వావలంబన, తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.తెలంగాణలో ఆహార శుద్ధి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రతిపాదిస్తు న్నాము. ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న ప్రోత్సాహకాలు పరిశీలించామని వెల్లడించారు.

- Advertisement -