సింగర్ సునీత పేరుతో 2 కోట్ల ఛీటింగ్..!

203
sunitha
- Advertisement -

ప్రముఖ సింగర్ సునీత పేరుతో జరిగిన ఛీటింగ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సునీత పేరు చెప్పి ఏకంగా రూ. 1.7 కోట్లు టోకరా వేశారు. బాధితుడు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో న్యూస్ బయటికొచ్చింది.

కొత్తపేటకు చెందిన ఓ మహిళ(44) సునీతకు వీరాభిమాని. 2019లో బాధితురాలి ఇంటి దగ్గరుండే చైతన్య అనే వ్యక్తి తాను సునీత మేనల్లుడినని చెప్పి…ఆమె వాట్సాప్‌ నంబర్‌ ఇదేనని ఒక నంబర్ ఇచ్చాడు. రెండు, మూడు సార్లు వాట్సాప్‌ లో ఆమె మెసేజ్‌ చేయగానే సునీత బాధితురాలి నంబర్‌ను బ్లాక్‌ చేశారు.

తర్వాత వేరే నంబర్‌ నుంచి సునీత నంబర్ అని చెప్పి చైతన్య ఇచ్చిన నంబర్ కు ‘మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి’ అంటూ మెసేజ్‌ చేసింది.అంతే అప్పటినుండి బాధితురాలికి కష్టాలు మొదలయ్యాయి.

కేరళలో ‘ఆనంద చేర్లాయం ట్రస్ట్‌’లో రూ.50 వేలు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని సూచించడంతో బాధితురాలు ఆమె సూచించిన బ్యాంకు ఖాతాకు డబ్బులను బదిలీ చేసింది. అలాగే పలు దఫాలుగా రూ.1.7 కోట్లు బాధితురాలి నుండి వసూలు చేశారు. దీంతో అనుమానం వచ్చిన బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా గుట్టురట్టైంది.

- Advertisement -