కొత్తగూడెంలో ఉద్యమంలా గ్రీన్ ఛాలెంజ్..

134
green challeng

రాజ్యసభ సభ్యులు,తెలంగాణ రాష్ట్ర టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగనిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా కొత్తగూడెం జిల్లాలోని కరకగూడెం వైద్యశాలలో డా.పర్షియా నాయక్ ఆధ్వర్యంలో 250 మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్బంగా పర్షియా నాయక్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం, మానవాళి మనుగడకోసం, భవిష్యత్ తరాల కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అన్నారు.

ప్రతి వైద్య కళాశాలలోను, ప్రతి ప్రాథమిక వైద్య కేంద్రంలోను మొక్కలు నాటాలి. మొక్కలు నాటడంలో ఇంతటి విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌కి ప్రత్యేక అభినందనలు అని పర్షియా నాయక్‌ పేర్కొన్నారు.