మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు‌ కరోనా..

47
koppula

తెలంగాణలో తాజాగా మరో మంత్రికి కరోనా సోకింది. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కరోనా బారినపడ్డారు. కొవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలినట్లు ఆయన తెలిపారు. నేను ఈ రోజు కరోనా పరీక్షలు చేసుకోగా పాజిటివ్ రావడం జరిగింది. ఈ మధ్యలో నన్ను కలవడానికి వచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు గాని లక్షణాలు ఉన్నచో వారు కూడా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ విజ్ఞప్తి చేశారు.