ఇండ్లు త్వరత్వరగా పూర్తి చేయాలి- ఎమ్మెల్యే

40
Challa Dharma Reddy

వరంగల్ రూరల్ జిల్లాలోని ఆత్మకూరు మండలంలోని గూడెప్పాడ్, కటాక్షపూర్ గ్రామాల్లో జరుగుతున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆకస్మికంగా తనికీ చేశారు.ఎమ్మెల్యే వెంట పంచాయతీ రాజ్ ఇంజినీర్ కిష్టయ్య, ఎంపీపీ మార్క సుమలత, మార్కెట్ కమిటీ చైర్మన్ కేశవ రెడ్డి, స్థానిక సర్పంచ్ యాదగిరి తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. మరో రెండు నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. నిర్మాణ పనుల్లో జాప్యం జరగకుండా పనులను త్వరత్వరగా పూర్తి చేయాలని అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు.