సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పది: సీఎం కేసీఆర్‌

58
cm kcr

అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పదని, ఎంతో స్వచ్ఛమైనదని సీఎం అన్నారు. ఓర్పు, సహనం, ప్రేమ, త్యాగం వంటి ఎన్నో సుగుణాలను మనం తల్లి నుంచే నేర్చుకుంటామని, ఒక మనిషి ఎదుగుదలకు మాతృమూర్తి పాత్ర ఎంతో కీలకమని సీఎం తెలిపారు. మహిళలు, మాతృమూర్తుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు సీఎం కేసీఆర్‌.