న్యూ ఇయర్ వేడుకలు అక్కడే..

146
Kohli

న్యూ ఇయర్ వేడుకలు ప్రేమజంటలకు మంచి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని అందిస్తాయి. న్యూ ఇయర్ వేడుకలను జరుపుకునేందుకు ప్రేమజంటలు మంచి ప్రదేశాలను ఎన్నుకుంటారు. ఫుల్ గా ఎంజాయ్ చేసేయాలని చూస్తుంటారు. అలాగే ఈ న్యూ ఇయర్ వేడుకలకు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి-బాలీవుడ్ నటి అనుష్క శర్మలు ఉత్తరాఖండ్ విహారానికి బయల్దేరి వెళ్లారు. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట… తాజాగా ఉత్తరాఖండ్ ఎయిర్ పోర్ట్ల దర్శనిమిచ్చింది. ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ ముగిసి విరాట్ కోహ్లికి కావాల్సిన విశ్రాంతి దొరకడంతో ప్రియురాలు అనుష్కతో కలిసి న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకోనున్నాడు.

Kohli

గతేడాది నూతన సంవత్సర వేడుకల్ని విరాట్-అనుష్కలు విదేశాల్లో జరుపుకున్నారు. ప్రేమికులైన కోహ్లి, అనుష్క తీరిక దొరికినప్పుడల్లా కలిసి విహరించడం తెలిసిందే. నిన్నమొన్నటివరకు ఇటు క్రికెట్‌ మ్యాచులు, అటు సినిమా షుటింగ్‌లతో అనుష్క బిజీబిజీగా గడిపారు. ఈ ఏడాదిని కోహ్లి అద్భుతమైన గణాంకాలతో ముగించగా, అనుష్క కూడా సుల్తాన్, ఏ దిల్ హై ముష్కిల్ మూవీలతో సక్సెస్ ను చవిచూసింది. ఈ బిజీ షెడ్యూళ్ల నుంచి ఇద్దరికీ కాసింత తీరిక దొరకడంతో జంటగా విహరించడానికి ఈ జోడి బయలుదేరి వెళ్లినట్టు తెలుస్తున్నది.