నన్నూ వాడుకున్నారు..

114
Kangana

బాలీవుడ్ క్వీన్ రంగనా రనౌత్ మైండ్‌లో ఏం చెప్పాలనుకుంటారో..మోహమాటం లేకుండా ఏ మాత్రం బెనకకుండా ధైర్యంగా చెప్పేస్తుంటుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో మహిళలకు జరుగుతున్న అన్యాయం గురించి చాలాసార్లే పెదవి విప్పింది. రెమ్యునరేషన్ విషయంలో హీరోయిన్లపై వివక్ష చూపిస్తున్నారంటూ మీడియా ముందే ప్రశ్నించింది. ఇలా ఎన్నో సంచలన కామెంట్స్ తో డేర్ అండ్ డాషింగ్ గాళ్‌ గా గుర్తింపు పొందిన కంగనా మరోసారి హాట్ కామెంట్ చేసింది. గతంలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లను హీరోలు వాడుకుంటున్నారని చేసిన వ్యాఖ్యలపై మరోసారి స్పందించింది. హీరోయిన్లను హీరోలు వాడుకుంటున్నారు..అన్న వ్యాఖ్యలపై ఇప్పుడు నిలబడతారా అన్న ప్రశ్నకు తనదైన రీతిలో సమాధానం చెప్పింది.

kangana-ranaut
ఇప్పుడే కాదు. ఎప్పుడూ నిలబడతాను. హీరోయిన్లను హీరోలు వాడుకుంటున్నారు అని మరోసారి బాంబు పేల్చింది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నన్నూ వాడుకున్నారు. అసలు స్టార్‌ హీరోయిన్లు అందరూ ఈ పరిస్థితిని ఎదుర్కొన్నవారే. ఎవరో కొందరు కుటుంబ నేపథ్యం ఉన్నవారు తప్పించి చాలామందికి నాకు ఎదురైన, జరిగిన అనుభవాలే జరిగాయి. ఇవన్నీ జగమెరిగిన సత్యాలే! నేను ఆ విషయాలే చెబితే కొందరు భుజాలు తడుముకుంటున్నారు. నేను అన్న మాటలు తప్పు అని ఎవరూ ఇంతవరకూ పబ్లిక్‌గా స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదు. అంటే నేను అన్నమాటలు నిజమేగా అంటూ సమాధానం చెప్పింది. అంతేకాదు 15 కోట్ల పారితోషికం అడుగుతున్నారట అన్న ప్రశ్నకు..నా ఇష్టం వచ్చినంత అడుగుతాను. నాకున్న డిమాండ్‌ని బట్టి ఇస్తారు. అలా ఇవ్వగలిగే వాళ్ళే నాతో సినిమా చేస్తారని చెప్పుకొచ్చింది.

kangana-ranaut