శాతకర్ణి ఆడియోకు 500 కార్లు, వెయ్యి బైకులు..

94
gauthamiputra

నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఆడియో వేడుకకు సిద్ధమైంది. గౌతమీ పుత్ర శాతకర్ణి పాటల విడుదల వేడుక రేపు సాయంత్రం తిరుపతిలోని నెహ్రూ మునిసిపల్ పాఠశాల మైదానంలో ఘనంగా జరుగనుంది. ఈ వేడుకకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబుతో పాటు హేమమాలిని సహా, చిత్ర నటీనటులందరూ రానున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే బాలయ్యకు ఇది 100వ సినిమా కావడంతో నందమూరి అభిమానులు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం విభిన్న తరహాలో తిరుపతిలో బాలకృష్ణ బసచేసే హోటల్ నుంచి 500 కార్లు, వెయ్యి బైకులతో భారీ ర్యాలీ తీయ్యనున్నారట.

gautamiputra-satakarni

ఈ ర్యాలీ సింహభాగంలో బాలకృష్ణ కూడా ఉంటారని అభిమాన సంఘాలు వెల్లడించాయి. ఎంట్రీ పాసులను వీవీఐపీలకు మాత్రమే ఇస్తున్నామని, సాధారణ అభిమానులు ఎంతమందైనా హాజరు కావచ్చని ఈవెంట్ నిర్వాహకులు తెలిపారు. నేటి సాయంత్రానికి ఏర్పాట్లు పూర్తవుతాయని తెలిపారు. ఇప్పటికే టీజర్‌ తో అందరిని ఆకట్టుకున్న బాలయ్య..ఆడియో ఎలా ఉండనుందోనని ప్రేక్షకులు క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. అలాగే ట్రైలర్ కోసం కూడా ఉత్కంఠతో ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈసినిమాను సంక్రాంతి బరిలో నిలపాలని చూస్తున్నారు.