అధికారిక లాంఛనాలు అవసరం లేదు

372
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావు భౌతికకాయానికి నేడు అంత్యక్రియలు జరపనున్నారు. నరసారావు పేటలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు కోడెల కుటుంబ సభ్యులు. నిన్న సాయంత్రం గుంటూరు టీడీపీ ఆఫీస్ నుంచి కోడెల పార్ధివదేహాన్ని నరసరావుపేటకు తరలించారు.

కోడెల సొంత నియోకవర్గంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు అవకాశం లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. అయితే కోడెల అంత్యక్రియలను ఏపీ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరుపుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా అందుకు కోడెల కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అధికారిక లాంఛనాలు అవసరం లేదని చెప్పారు.

బతికున్న సమయంలో కేసులతో చిత్రహింసలు పెట్టి ఇప్పుడు లాంఛనాలు ఎందుకుని ప్రశ్నించారు. కోడెల కుటుంబీకులెవరూ ప్రభుత్వ మొక్కుబడి లాంఛనాన్ని అందుకునేందుకు సిద్ధంగా లేరన్నారు గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు . పేటలో కోడెల అభివృద్ధి చేసిన స్వర్గపురిలోనే నేటి మధ్యాహ్నం అంత్యక్రియలు జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

- Advertisement -