రాహుల్ సెంచరీ…భారత్‌ 272/3

60
kl rahul

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో తొలిరోజు భారత్ పట్టుబిగించింది. కేఎల్ రాహుల్ సెంచరీతో రాణించడంతో భారత్‌ 272 పరుగులు చేసి కేవలం 3 వికెట్లు మాత్రమే కొల్పోయింది. కేఎల్ రాహుల్ (122 బ్యాటింగ్: 248 బంతుల్లో 16×4, 1×6) అజేయ సెంచరీతో క్రీజులో ఉన్నారు. రాహుల్‌తో పాటు క్రీజులో అజింక్య రహానె (40 బ్యాటింగ్: 81 బంతుల్లో 8×4) ఉన్నారు.

టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ (60: 123 బంతుల్లో 9×4) జోడీ తొలి వికెట్‌కి 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అగర్వాల్ ఔటైన తర్వాత వచ్చిన పుజారా డకౌట్‌గా వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ (35: 94 బంతుల్లో 4×4) రాణించిన ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. రాహుల్- రహానె జోడి.. చివరి సెషన్‌ ఆఖర్లో ఓపికగా ఆడి.. ఈరోజు మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. దీంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.