తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలివే..

151
petrol

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ పెట్రోల్ ధరలు నిలకడగానే ఉన్నాయి. దేశ ఇంధన ధరల్లో ఇవాళ ఎలాంటి మార్పులు లేకపోవడంతో చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక ఈ నెలలో చమురు ధరలు స్థిరంగా ఉండటం ఇది వరుసగా 27వ సారి.

హైదరాబాద్‌లో లీటరుకు పెట్రోల్ ధర రూ.108.20 వద్దనే కొనసాగుతోంది. డీజిల్ రేటు కూడా ఇదే దారిలో నడిచింది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్దనే స్థిరంగా కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.64 శాతం క్షీణించింది. దీంతో బ్రెంట్ ఆయిల్ ధర 76.03 డాలర్లకు తగ్గింది.