బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే ఆఫర్..

135
bsnl

ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్‌ఎల్ అదిరిపోయే ఆఫర్‌ని ప్రకటించింది. రూ.599 ప్లాన్‌తో ప్రతిరోజూ 5జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ పొందవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. డైలీ డేటా లిమిట్ ముగిసిన అనంతరం 40 KBPS డేటా వాడుకోవచ్చని పేర్కొంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు ఉంటుందని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.

ఈ సదుపాయాలతో పాటు జింగ్‌మ్యూజిక్‌ను ఉచితంగా ఆనందించవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఇతర నెట్‌వర్కులతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన ఆఫర్ చాలా తక్కువ ధరకు వస్తుందని వెల్లడించారు.