త్వరలో వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు..!

86
rohith

త్వరలో భారత్‌కు వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను నియమించే అవకాశం ఉందని వెల్లడించారు టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ కిరణ్ మోరే. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఒక్కడే వన్డే,టెస్టు,టీ 20లకు కెప్టెన్‌గా ఉండగా రోహిత్ శర్మ భవిష్యత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రోహిత్‌ శర్మకు త్వరలో అవకాశం వస్తుందని …ఇంగ్లాండ్‌ పర్యటన తర్వాత ఈ నిర్ణయాల గురించి మీకు మరింత సమాచారం తెలుస్తుందని మోరే పేర్కొన్నారు. ఏదో ఒకరోజు విరాట్‌ కోహ్లీనే స్వయంగా రోహిత్‌తో బాధ్యతలను పంచుకోవడానికి ముందుకొస్తాడని వెల్లడించారు.

ఇగ్లాండ్‌ టెస్టు జట్టుకు జో రూట్‌, వన్డే టీమ్‌కు ఇయాన్‌ మోర్గాన్‌, ఆస్ట్రేలియా టెస్టు టీమ్‌కు టిమ్‌ పైన్‌, వన్డే జట్టుకు అరోన్‌ ఫించ్‌ కెప్టెన్లుగా కొనసాగుతున్నారు. టీమిండియాకు కూడా అలానే నియమిస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని పలవురు సైతం అభిప్రాయపడుతున్నారు.