సోనూ సంచలన నిర్ణయం..!

60
sonu

రియల్ హీరో సోనూ సూద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ అందక అలమటిస్తున్న వారికి అండగా నిలబడేలా తాను చేస్తున్న సోషల్ సర్వీస్‌ను మరింత విస్తృతం చేశారు.

ఆక్సిజన్ సిలిండర్స్ కోసం దేశమంతా ఆర్తనాధాలు వినిపిస్తుండడంతో ఎవరు ఎంత దూరం నుంచి అడిగినా కూడా ఆక్సిజన్ సిలిండర్ పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికి అవసరం ఉన్నా కూడా www.umeedbysonusood.com కు లాగిన్ అవ్వాలని కోరారు. ఆక్సిజన్ సిలిండర్స్ డిటిడిసి ద్వారా అవసరమైన వారికి పంపబడుతుందని తెలియజేశారు.

గత ఏడాది నుంచి కరోనా లాక్ డౌన్ సమయంలో సోనూసూద్ నిర్విరామ సేవలు మొత్తం ప్రపంచమంతా జేజేలు పలికిందంటే అతిశయోక్తి కాదేమో. తన సొంత ఖర్చులతో ఆపదలో ఉన్న వారి కష్టాలు తొలగించేందుకు సోనూ చేస్తున్న ప్రయత్నం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి.