IPL 2024 :కోహ్లీ పైనే భారమా?

40
- Advertisement -

ఐపీఎల్ టైటిల్ కోసం ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న ఆర్సీబీ ఈసారి ఎలాగైనా కప్పు సాధించాలనే లక్ష్యంతో ఉంది. టైటిల్ నేగ్గే సామర్థ్యం పుష్కలంగా ఉన్నప్పటికి ఆ జట్టుకు మొదటి నుంచి లక్ కలిసి రావడం లేదు. హార్డ్ హిట్టర్లు, పదునైన పేస్ దళం ఉండడంతో ఈసారి ఎలాగైనా కప్పు గెలవలనే పట్టుదలతో ఉంది. అయితే ఆటగాళ్లు ఫామ్ లో లేకపోవడంతో ఆ జట్టును అపజయాలు పలకరిస్తున్నాయి. ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ రెండు మ్యాచ్ లో ఓటమి చవిచూసింది. నిన్న కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో కూడా ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. .

మొదట బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు మాత్రమే చేసింది. విరాట్ కోహ్లీ (83) మినహా మిగిలిన బ్యాట్స్ మెన్స్ ఎవరు రాణించలేకపోయారు. గ్లెన్ మ్యాక్స్ వెల్ (28), గ్రీన్ (33), దినేష్ కార్తీక్ (20).. ఇలా హార్డ్ హిట్టర్స్ అంతా తక్కువ స్కోర్ కే పరిమితం అయ్యారు. దాంతో కోల్ కతా 16.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఆర్సీబీ బౌలర్స్ కూడా పెద్దగా రాణించకపోవడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో టీం ఆటగాళ్లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కప్పు గెలవలనే కసితో పాటు ప్లేయర్స్ కూడా పట్టుదలగా ఆడాలని సూచిస్తున్నారు.

కోహ్లీ పైనే జట్టు భారం

ఆర్సీబీ తరుపున విరాట్ కోహ్లీ మినహా మిగిలిన బ్యాట్స్ మెన్స్ అంతా చేతులెత్తేస్తున్నారు. డూప్లెసిస్, మాక్స్ వేల్, గ్రీన్.. ఇలా బలమైన బ్యాటింగ్ దళం ఉన్నప్పటికి గ్రౌండ్ లో మాత్రం ఘోరంగా విఫలం అవుతున్నారు. గత మూడు మూడు మ్యాచ్ లలో కోహ్లీ మాత్రమే మెరుగైన స్కోర్ అందించాడు. ఈ నేపథ్యంలో మాజీలు ఆర్సీబీ ప్లేయర్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. కోహ్లీపైనే జట్టు భారం వేస్తే సరిపోదని, మిగిలిన ఆటగాళ్లు కూడా అతడికి సహకారం అందించాలని చెబుతున్నారు. ప్రస్తుతం కోహ్లీ మూడు మ్యాచ్ లకు గాను 181 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా ఉన్నాడు. మరి ముందు రోజుల్లోనైనా కోహ్లీకి ఇతర ప్లేయర్స్ నుంచి సహకారం లభిస్తుందేమో చూడాలి.

Also Read:భోజనానికి ముందు పెరుగు తింటే?

- Advertisement -