‘ఖిలాడి’ టీజర్‌కు డేట్ ఫిక్స్‌..

41
Khiladi

‘క్రాక్’ సినిమాతో సక్సెస్ అందుకున్న మాస్‌ మహారాజా రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ‘క్రాక్’ తరువాత ప్రాజెక్టుగా ఆయన పట్టాలెక్కించిన ‘ఖిలాడి’ సినిమా, చకచకా షూటింగు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. కోనేరు సత్యానారాయణ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో, రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇందులో నాయికలుగా మీనాక్షి చౌదరి – డింపుల్ హయతి అలరించనున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, మే 28వ తేదిన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుండి ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది. ‘ఉగాది’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీన ఉదయం 10:08 నిమిషాలకు ‘ఖిలాడి’ టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఆ విషయాన్ని తెలియజేస్తూ, ఈ సినిమా టీమ్ ఒక పోస్టర్ ను విడుదల చేసింది.