మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత..

186
Green India Challenge

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మొక్కలు నాటారు కొమురవెల్లి రమేష్ (రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తరగతి సహచరుడు). అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలుపుతూ తన జన్మదినం సందర్భంగా ఇందిరా పార్క్ వద్ద మొక్కలు నాటనని కొమురవెల్లి రమేష్ తెలిపారు.