గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణనాథుడు

327
khiaratabad ganesh
- Advertisement -

9 రోజుల పాటు భక్తుల పూజలందుకున్న ఖైరతాబాద్ మహా గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర మధ్యాహ్నం ముగిసింది. టెలిఫోన్‌ భవన్‌, తెలుగు తల్లి ఫ్లైఓవర్‌, సెక్రటేరియట్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా మహాగణపతి ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. 57 అడుగుల పొడవు, 24 అడుగుల వెడల్పు గల మహాగణపతిని పూజాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు.

గణనాథునికి వీడ్కోలు పలికేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అడుగడుగునా పోలీస్ భద్రతా మధ్య ప్రశాంతంగా శోభాయాత్ర సాగింది. చిన్నారులు, యువత, మహిళలతో ట్యాంక్ బండ్ కోలాహలంగా మారింది.

khairatabad

ఈ ఏడాది సప్త ముఖ కాలసర్ప మహాగణనాథుడిగా భక్తులకు దర్శనమిచ్చాడు మహా గణపతి. శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. క్రేన్‌ నెంబర్‌-6 దగ్గర ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం చేశారు. వినాయక నిమజ్జనానికి భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు.

గత ఏడాది 11 వేల గణనాథులు నిమజ్జనం కాగా.. ఈ సారి 15 వేల వినాయకులను నిమజ్జనం చేశారు. అయితే ఈ సారి నిమజ్జన సమయంలో ప్రతీ గణ నాథునికి జియో ట్యాగింగ్ అమర్చారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

- Advertisement -