బాలాపూర్ లడ్డూ చరిత్ర…

540
balapur laddu

బాలాపూర్ గణపతికి, ఆయన చేతి లడ్డూకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నగరానికి దక్కిన ఈ ఖ్యాతి, ప్రపంచం నలుమూలా ఆసక్తిని రేకెత్తించింది. ఏటా వచ్చే వినాయక చవితి పేరు చెబితే మొదటగా గుర్తొచ్చేది బాలాపూర్ గణేశుని లడ్డూనే. మరి ఈ లడ్డూకు అంత క్రేజెందుకంటారా…! ‘కోరిన కోర్కెలు నెరవేర్చే లడ్డూ’గా పేర్కొంటుంటారు బాలాపూర్ వాసులు.

లడ్డూ వేలంపాట ద్వారా వచ్చిన మొత్తాన్ని గణేశ్‌ ఉత్సవ కమిటీ గ్రామాభివృద్ధి, సామాజిక సేవా కార్యాక్రమాల కోసం వినియోగిస్తూంటారు. హైదరాబాద్ నగరం అంటే గణేష్ నవరాత్రులకు పెట్టింది పేరు. గణేష్ ఉత్సవాలను నగరవాసులు అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. నగరంలో ఖైరతాబాద్ గణేషుడికి ఎంత ప్రత్యేకత ఉందో బాలాపూర్ గణేషుడి లడ్డూకి కూడా అంతే ప్రత్యేకత ఉంది. బాలాపూర్ లడ్డూను దక్కించుకోవటానికి రాజకీయ నాయకుల నుండి పారిశ్రామికవేత్తలు ఇలా పలు రంగాలవారు పోటాపడుతుంటారు.

1980లో మొదలై…గణేశునిపై బాలాపూర్‌వాసులకున్న భక్తి, సేవాతత్పరతను చాటిచెబుతూ 36 ఏళ్ల సుదీర్ఘ యానంతో చరిత్రను సృష్టించింది. గణేష్ నవరాత్రులు ముగిసేవరకు బాలాపూర్ వాసులు మద్య, మాంసాలను ముట్టకుండా గణేశునితోపాటు లడ్డూను కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. లడ్డూను వేలంలో దక్కించుకున్న వారే కాకుండా ఆ లడ్డూను దర్శించి పూజించిన వారు కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నామని భక్తులు తమ అనుభవాలను వెల్లడిస్తుంటారు. తొలిసారి 1994లో నిర్వహించిన బాలాపూర్ లడ్డూ వేలంలో రూ. 450 పలికింది.

2016లో కందాడి స్కైలాబ్ రెడ్డి 14 లక్షల 65 వేల రూపాయలకు అమ్ముడైంది. 2017లో ఆ రికార్డును బ్రేక్ చేస్తూ 15.60 లక్షల రూపాయల రికార్డు ధరకు విజన్ ఇండియా ఎండీ నాగం తిరుపతి రెడ్డి సొంతం చేసుకున్నారు.2018లో  ఆర్యవైశ్య సంఘం నేత శ్రీనివాస్ గుప్తా 16 లక్షల 60 వేల రూపాయలకు బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్నారు.