కేటీఆర్‌తో విభేదాలు లేవు…కేసీఆరే శ్రీరామ రక్ష

228
harish ktr
- Advertisement -

ప్రజాభిమానం చూసి భావోద్వేగంతోనే ఇబ్రహీంపూర్‌ సభలో అలా మాట్లాడానని మంత్రి హరీష్ స్పష్టం చేశారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన హరీష్‌….కేటీఆర్‌తో విభేదాలు లేవని స్పష్టం చేశారు. మా ఇద్దరిపై వస్తున్న వార్తలు ఉహాజనితమేనని…రాష్ట్రానికి కేసీఆరే శ్రీరామ రక్ష అన్నారు. అధినేత చెప్పింది చేయడమే తన పని అని మహాకూటమి వస్తే మళ్లీ తెలంగాణను తాకట్టుపెడతారని చెప్పారు.

తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఎజెండా లేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ వ్యతిరేకతతో పుట్టిన తెలుగుదేశం పార్టీ అదే కాంగ్రెస్‌తో పొత్తు అంటోందన్నారు. ఈ పార్టీలన్నీ కలిసి ఏర్పరిచే మహాకూటమిని ప్రజలు ఎందుకు నమ్ముతారని ప్రశ్నించారు.

harish

ఈ రాష్ట్రంలో సుస్థిర పరిపాలన కావాలంటే కేసీఆర్‌ను గెలిపించాలని ప్రజల్లో కూడా స్పష్టత ఉంది. కాంగ్రెస్‌ వాళ్లు వస్తే ఏడాదికో సీఎం వస్తారు. ప్రతిపక్షంలో ఉంటేనే కుర్చీల కోసం కొట్లాడుకుంటున్నారు. గతంలోనూ చెన్నారెడ్డి పోయి జనార్ధన్‌రెడ్డి వచ్చారు. రాజశేఖరరెడ్డి దురదృష్టవశాత్తూ చనిపోతే రోశయ్య.. ఆయన ఏడాదికే దిగిపోయి కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చారని
తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తయ్యాయని వచ్చే వర్షాకాలం నాటికి తప్పకుండా నీరందించింది తీరుతామన్నారు. ఒక భారీ సాగునీటి ప్రాజెక్టును ఇంత వేగంగా పూర్తిచేయడం ఓ రికార్డన్నారు. కేసీఆర్ పట్టుదల వల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్రచారంలో ఎవరు ఎక్కడ తిరగాలనేది కేసీఆరే నిర్ణయిస్తారని ..టీఆర్ఎస్ వంద సీట్లు గెలవడం ఖాయమన్నారు.

- Advertisement -