బాలాపూర్‌లో మంత్రి సబితా ప్రత్యేక పూజలు..

167
sabitha

ప్రసిద్ధ బాలాపూర్ గణేశునికి తొలి రోజు పూజ చేసిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.ఈ సందర్భంగా మంత్రి సబితకు ఘనంగా స్వాగతం పలికారు బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డితో మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి,ఉత్సవ సమితి అధ్యక్షులు నిరంజన్ రెడ్డి పాల్గొనగా ఆరు అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు సబితా. ప్రజలందరిని కరోనా నుండి కాపాడాలని కోరుకున్నానని తెలిపారు. ఈ సందర్భంగా లడ్డు ప్రసాదాన్ని అందజేశారు నిర్వాహకులు.