ఐదో విడత బరిలో ఉన్న ‘కీ’ లీడర్లు వీరే…

223
smirithi irani

సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా ఐదో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 7 రాష్ట్రాల పరిధిలోని 51 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతుండగా దేశవ్యాప్తంగా 674 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

బీహార్‌లో ఐదు, జమ్మూకశ్మీర్‌లో రెండు, జార్ఖండ్‌లో నాలుగు, మధ్యప్రదేశ్‌లో ఏడు, రాజస్థాన్‌లో 12, ఉత్తరప్రదేశ్‌ లో 14, పశ్చిమ బెంగాల్‌ లోని 7 లోకసభ స్థానాలలో పోలింగ్ జరుగుతోంది.

యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ,కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌, రాజ్యవర్ధన్‌సింగ్‌ రాథోడ్‌, జయంత్‌ సిన్హా, నిరంజన్‌ జ్యోతి,స్మృతి ఇరానీతో పాటు పలువురు ప్రముఖులు ఐదో విడత ఎన్నికల బరిలో ఉన్నారు. సోనియా కాంగ్రెస్ కంచుకోట రాయ్‌ బరేలి నుండి పోటీచేస్తోండగా అమేథీ నుండి రాహుల్‌ గాంధీ, ప్రత్యర్థిగా కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ పోటీపడుతున్నారు. మొత్తం 51 లోక్‌సభ స్థానాల్లోని 9,688 పోలింగ్‌ కేంద్రాల్లో 8.75 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.