దాసరికి ఇది నిజమైన నివాళి..

152
Dasari Short Films

‘దాసరి టాలెంట్ అకాడమి’ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ బహుమతీ ప్రదానోత్సవంలో నటుడు డాక్టర్ మోహన్ బాబు,నటి జయసుధ పాల్గొన్నారు. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు ఆశయాలకు కొనసాగింపుగా.. కొత్త ప్రతిభను పరిశ్రమకు పరిచయం చేయాలనే లక్ష్యంతో ఏర్పాటైన ‘దాసరి టాలెంట్ అకాడమీ’ 2019 సంవత్సరానికి గాను షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ప్రకటించడం తెలిసిందే. ఈ కాంటెస్ట్‌లో గెలుపొందినవిజేతలకు బహుమతీ ప్రదానోత్సవం హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో అత్యంత ఘనంగా నిర్వహించారు.

Dasari Short Films

ప్రముఖ నటులు డాక్టర్ మోహన్ బాబు, సహజనటి జయసుధ, సాక్షి ఎడిటోరియల్ అడ్వైజర్ కె.శ్రీరామచంద్రమూర్తి, తమ్మారెడ్డి భరద్వాజ, ఆర్.నారాయణమూర్తి, సి.కళ్యాణ్ ఈ బహుమతులను అందించారు. కాంటెస్ట్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ‘ప్రార్టిసిపేటరీ సర్టిఫికెట్స్’ ఇచ్చారు. ఇదే వేదికపై ఆరుగురు పేద విద్యార్థినీవిద్యార్థులకు నగదు సహాయం అందించారు. దాసరి ఆశయాలకు కొనసాగింపుగా దాసరి టాలెంట్ అకాడమీ స్థాపించి.. షార్ట్ ఫిలిం కాంటెస్ట్ కు శ్రీకారం చుట్టిన బి.ఎస్.ఎన్.సూర్యనారాయణను మోహన్ బాబు, జయసుధతోపాటు ఇతర అతిధులు అభినందించారు. దాసరి టాలెంట్ అకాడమీ వారు సూచించిన ఒక స్టూడెంట్ కి తమ విద్యా సంస్థలో ఎల్.కె.జీ నుంచి ప్లస్ టు వరకు ఉచిత విద్య అందిస్తామని మోహన్ బాబు ప్రకటించారు. దాసరికి నివాళిగా తలపెట్టిన షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ను ప్రతి ఏడాది కొనసాగిస్తామని దాసరి టాలెంట్ అకాడమీ అధినేత బి.ఎస్.ఎన్.సూర్యనారాయణ అన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

Dasari Short Filmsఈ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ కు జ్యూరీ చైర్మన్ గా తమ్మారెడ్డి భరద్వాజ, జ్యూరీ మెంబర్స్ గా ప్రముఖ దర్శకులు ధవళ సత్యం, రేలంగి నరసింహారావు, రాజా వన్నెం రెడ్డి, సీనియర్ రైటర్ రాజేంద్రకుమార్ పైడిపాటి వ్యవహరించారు. ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, శాఖమూరి మల్లిఖార్జునరావు ఆహ్వాన కమిటీ సభ్యులుగా ఉన్నారు.

మానవ సంబంధాలు, మానవీయ విలువల నేపథ్యంలో రూపొందిన షార్ట్ ఫిల్మ్స్ నుంచి విజేతలను ఎంపిక చేశారు. ప్రధమ బహుమతిగా ‘పసుపు-కుంకుమ’కు లక్ష రూపాయలు, రెండో బహుమతి ‘మాతృదేవోభవ’కి 50 వేలు, మూడవ బహుమతి ‘తాతా మనవడు’కి 25 వేలుతో పాటు.. మొదటి జ్యూరీ అవార్డు 25 వేలు, రెండవ జ్యూరీ 15.000/-, ఉత్తమ దర్శకుడు 20.000/-, ఉత్తమ కథా రచయిత 10.000/-, ఉత్తమ నటుడు 10,000/-, ఉత్తమ నటి 10.000/- చొప్పున నగదు బహుమతులు ‘నీహార్ ఈ సెంటర్’, లాంపెక్స్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, శాంసంగ్ సౌజన్యంతో అందజేశారు.