సర్కారు వారి పాట..స్పెయిన్ లో!

40
keerthy suresh

పరుశరామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సర్కార్ వారి పాట. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రెస్టీజియస్ మూవీను నిర్మిస్తున్నాయి. మహేశ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోంది. తాజా షెడ్యూల్ ను స్పెయిన్ లోని బార్సిలోనాలో ప్లాన్ చేశారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి చెన్నై నుంచి స్పెయిన్ కు చేరుకుంది కీర్తి. విమానంలో ఉన్నప్పుడు దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఈ విషయాన్నీ తెలిపింది.

సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13 న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి ఆర్ మాది సినిమాటోగ్రాఫర్, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.