మరో దారుణం.. ఈ సారి కీర్తి సురేష్!

34
- Advertisement -

డీప్ ఫేక్ నిజంగా హీరోయిన్ల గుండెల్లో బాంబులు కాదు, కన్నీళ్లను పేల్చుతోంది. రష్మిక, కాజోల్, దీపికా, ప్రియాంక ఇలా ఎవరు, ఏ రోజు ఈ డీప్‌ ఫేక్‌ కు బలవుతారో అర్థం కానంతగా.. హీరోయిన్లను భయాందోళనకు గురి అవుతున్నారు. ప్రస్తుతానికి కీర్తి సురేష్ ఈ డీప్ ఫేక్‌ కు బలైంది. ఏకంగా ఆమె ఫోటోను కాకుండా అశ్లీల వీడియోలను కూడా క్రియేట్ చేశారు. ఎవరో అశ్లీల వీడియోలకు కీర్తి సురేష్ ఫేస్ పెట్టి డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేశారు. దీంతో, కీర్తి సురేష్ డీప్ ఫేక్ అశ్లీల వీడియోను ట్విట్టర్ లో కొంతమంది షేర్ చేస్తున్నారు. అశ్లీల వీడియో కావడంతో ఊరు పేరు లేని ట్విట్టర్ ఎకౌంట్స్ లో మాత్రం కీర్తి సురేష్ డీప్ ఫేక్ వీడియో వైరల్ అవుతుంది.

నిజంగా ఇది దారుణం. ఓ హీరోయిన్ పై ఇలాంటి నీచమైన వీడియోలు క్రియేట్ చేసి వారికీ మానసిక క్షోభను గురి చేస్తున్న వారి పై అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉంది. అన్ని వర్గాల నుంచి ఇలాంటి వాటి పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా.. ఇలాంటి నీచమైన పనులను కొందరు ఇంకా చేస్తుండటం బాధాకరమైన విషయం. అసలు విషయం ఏమిటనేది జనాలకు కూడా అర్థమైంది కాబట్టి, ఇలాంటి డీప్ ‌ఫేక్‌ వీడియోలు వచ్చినప్పుడు అందుకు తగ్గట్టుగానే సరైన రీతిలో రియాక్ట్ అవ్వడం మన బాధ్యత అని ప్రతి ఒక్కరూ భావించాలి.

ఇలా నిత్యం ఎవరో ఒక హీరోయిన్‌పై డీప్ ఫేక్ రాయళ్లు అటాక్ చేస్తూనే ఉంటారు. ఐతే, ఆ వీడియోలు నెట్టింట హల్‌చల్‌ చేయకుండా నెటిజన్లే అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే, ఇలాంటి కంటెంట్ కు ఆదరణ దక్కకుండా పోతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఇలాంటివి బయటకు రాకుండా ఉంటాయి. అయినా, టెక్నాలజీని మిస్ యూజ్ చేయకుండా అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా ప్రభుత్వాలు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుకుందాం.

Also Read:శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి

- Advertisement -